ATP: గుత్తి మండలం ఊబిచెర్ల గ్రామంలో సోదరులు చలపతి, రమేష్ అనే రైతులకు చెందిన కంది కట్టి, వేరుశనగ పొట్టు వాములకు మంగళవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. మంటల్లో కంది కట్టి, వేరుశనగ పొట్టు వాములు పూర్తిగా కాలిపోయాయి. భారీగా నష్టం వాటిలినట్లు బాధిత రైతులు చలపతి, రమేష్ వాపోయారు. పోలీసుల దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు.