ADB: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈనెల 12న ఉట్నూర్ ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. టాటా గ్రూప్, బజాజ్ ఆటో, వర్ల్పూల్ వంటి ప్రముఖ కంపెనీలు ఇందులో పాల్గొంటాయని పేర్కొన్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.12,500 నుంచి రూ.17,500 వరకు వేతనం ఉంటుందని వెల్లడించారు.