KDP: ‘వికసిత్ భారత్-2047’ మరియు ‘రోజ్గార్ యోజన’పై ఇంఛార్జ్ జేసీ, DRO విశ్వేశ్వరనాయుడు బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ పథకాల ముఖ్య లక్ష్యాలు ఉపాధి కల్పన, కార్మికుల సామాజిక భద్రత అని ఆయన తెలిపారు. వ్యవస్థీకృత రంగంలోకి సంస్థలను తీసుకువచ్చి, నిబంధనలు పాటించేలా చూడాలని, పరిశ్రమలు, విద్యా సంస్థలను ఈ కార్యక్రమాలలో భాగస్వాములను చేయాలని అధికారులకు సూచించారు.