GNTR: తాడేపల్లిలోని సీతానగరంలో కూల్ డ్రింక్ షాప్ నడుపుకునే వెంకటరావుపై ఈనెల 4న జరిగిన దాడి కేసును పోలీసులు ఛేదించారు. కేవలం వాటర్ బాటిల్ విషయంలో జరిగిన వివాదమే ఈ దాడికి కారణమని తేలింది. ఈ కేసులో తెనాలి ఐతానగర్‌కు చెందిన బాలసాని శ్రీకాంత్, కోటేశ్వరరావు, నాగరాజు, గరికే శ్రీనులను పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి వివరాలను మీడియాకు తెలిపారు.