WGL: రాయపర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో శుక్రవారం జరిగిన భౌతిక దాడిలో పెరికవేడు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నేతలు పుట్ట రాజు, బండి రాజబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. పత్తి విక్రయానికి వచ్చిన వారు చేపల విక్రయ మహిళతో గొడవ పడుతున్న యువకులను ఆపే ప్రయత్నంలో దాడికి గురయ్యారని స్థానికులు తెలిపారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.