ATP: నేటి నుంచి సంక్రాంతి సెలవులు కావడంతో సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో శనివారం గుత్తి ఆర్టీసీ బస్టాండ్ కిటికిటలాడింది. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం ఉండటం కూడా రద్దీకి ఒక కారణం. బస్సులు రాగానే సీట్ల కోసం పోటీ పడుతున్నారు. సీట్లు లేకపోయినా నిలబడే ప్రయాణం చేస్తున్నారు. రద్దీ వేళ దొంగతనాలు జరిగే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.