AP: CM చంద్రబాబు సంక్రాంతి పండగను తన స్వగ్రామం తిరుపతి జిల్లా నారావారిపల్లెలో జరుపుకోనున్నారు. ఈ మేరకు కుటుంబ సమేతంగా ఈ నెల 12 రాత్రికి గ్రామానికి వెళ్లనున్నారు. 15 వరకు CM కుటుంబం నారావారిపల్లెలోనే ఉండనుంది. కాగా 12న జిల్లాలోని సూళ్లూరుపేటలో జరిగే ‘ఫ్లెమింగో ఫెస్టివల్’ ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.