SRCL: కోనరావుపేట మార్కెట్ కమిటీలో వివిధ అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రూ. 51.55 లక్షల నిధులు మంజూరు చేసింది. కమిటీ ఛైర్మన్ ఎల్లయ్య ప్రతిపాదనల మేరకు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చొరవతో నిధులు విడుదలయ్యాయి. వీటితో మార్కెట్ యార్డుకు ప్రహరీ గోడ, ఆర్చీ నిర్మాణం చేపట్టనున్నారు. పలు గ్రామాల్లోని యార్డుల వద్ద హైమాస్ట్ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయనున్నారు.