అనంతపురం బుడ్డప్ప నగర్లోని ఐసీడీఎస్ బాలసదనంలో ప్రవేశం కోసం అర్హులైన బాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సూపరింటెండెంట్ ఖాజీ రఫీమున్నీసా తెలిపారు. తల్లిదండ్రులు లేని, నిరుపేద కుటుంబాలకు చెందిన 6 నుంచి 11 ఏళ్ల లోపు అమ్మాయిలు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగల వారు 63099 39275, 86394 68664 నంబర్లలో సంప్రదించాలని కోరారు.