PLD: ఎడ్లపాడు(మం) పుట్టకోటలో విద్యుత్తు లైన్ల మరమ్మతుల కారణంగా గురువారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఆ శాఖ ఏడీఈ అశోక్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. గృహ, వాణిజ్య, పరిశ్రమలకు, వ్యవసాయ సర్వీసులకు మెరుగైన విద్యుత్ కోసం వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.