అన్నమయ్య: పీలేరు మండలం ఠాణా వడ్డిపల్లి మలుపు వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఠాణా వడ్డిపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ (28) ఎల్లంపల్లి నుంచి వస్తుండగా రోడ్డు దాటే సమయంలో ప్రమాదం జరిగింది. గాయపడిన వెంకటేష్‌ను 108 వాహనం ద్వారా పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.