SRD: కంగ్టి మండల ముర్కుంజాల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ సారంగి అనూష లాల్ కుమార్ అధ్యక్షతన గురువారం ఉదయం 10 గంటలకు గ్రామసభ నిర్వహిస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి జ్ఞాన్ దేవ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు,గ్రామ ప్రజలు యువజన సంఘాల నాయకులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.