NRPT: వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ వినీత్ హెచ్చరించారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పరిమితికి మించి ప్రయాణికులను తరలించడం ద్వారా రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని ప్రజల ప్రాణాలు, భద్రత నేపథ్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని అన్నారు.