NTR: జి. కొండూరు మండలం వెలగలేరులో కోతుల దాటికి స్థానిక ప్రజలు బెంబేలు ఎత్తుతున్నట్లు తెలిపారు. ఈ కోతుల దాటికి ఇళ్లలో సైతం ఉండలేని పరిస్థితి ఉందన్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులపై కోతుల దాడులు ఎక్కువయ్యాయని ఆవేదన చెందారు. ముఖ్యంగా గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద వందల సంఖ్యలో కూతులు ఉన్నట్లు తెలిపారు. అధికారులు స్పందించి కోతుల బారి నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.