BPT: సంతమాగులూరు(మం) ఏల్చూరు టోల్ ప్లాజా వద్ద ఎస్సై పట్టాభి రామయ్య వినూత్నంగా ట్రాఫిక్ తనిఖీలు చేపట్టారు. బుధవారం రాత్రి హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వాహనదారులను ఆపి, వారికి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. కేవలం హెచ్చరికలతో వదిలేయకుండా, నిబంధనలు ఉల్లంఘించిన వారి చేత అక్కడికక్కడే హెల్మెట్లు కొనుగోలు చేయించారు.