భారత్ చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. అంతరిక్షంలోనే ఉపగ్రహాలకు ఇంధనం నింపే (On-orbit refueling) తొలి మిషన్ ‘ఆయుల్శాట్’ (AayulSAT) ప్రయోగానికి రంగం సిద్ధమైంది. చెన్నైకి చెందిన ‘ఆర్బిట్ఎయిడ్ ఏరోస్పేస్’ దీన్ని రూపొందించింది. ఈ నెలలోనే ఇస్రో పీఎస్ఎల్వీ-సి62 రాకెట్ ద్వారా ఈ అరుదైన ప్రయోగం జరగనుంది.