»That Time Is Very Important In Jeff Bezos Daily Routine Do You Know Why
Jeff Bezos: జెఫ్ బెజోస్ దినచర్యలో ఆ టైమ్ చాలా ఇంపార్టెంట్ అంటా.. ఎందుకో తెలుసా?
ప్రపంచ కుబేరుళ్లో ఒకరైన దిగ్గజ వ్యాపార వేత్త జెఫ్ బెజోస్ దినచర్య ఎలా ఉంటుందో అని అందరికీ తెలుసుకోవాలని ఉంటుంది. తాజాగా ఆయన తన డైలీ రొటీన్, రోజులోని ఆయన ఇంపార్టెంట్ టైమ్ గురించి చెప్పారు.
Jeff Bezos: ప్రపంచ దిగ్గజ వ్యాపార వేత్త జెఫ్ బెజోస్ గురించి తెలుసు. అమెజాన్ వ్యవస్థాపకుడు, ప్రపంచ బిలియనీర్లలో ఒకరైన ఈ టెక్ దిగ్గజం దిన చర్య ఎలా ఉంటుందో తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా చాలా బిజినెస్‌లు ఉన్నాయి. వాటిన్నింటికి ఎలా తన సమయాన్ని కెటాయిస్తారు అనే అనుమానం కూడా ఉంటుంది. ఆయన ఎప్పుడు నిద్రపోతాడు, బ్రేక్ ఫాస్ట్ ఏం తింటారు లాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరికింది. తానే స్వయంగా ఆయన దినచర్య గురించి చెప్పారు. ఎందరికో స్పూర్తిగా నిలిచిన ఈయన డైలీ రొటీన్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
“నేను త్వరగా నిద్రపోతాను. అంతే తర్వగా నిద్రలేస్తా. మనసుకు నచ్చిన పనులు చేస్తుంటా. ఉదయం వార్తా పత్రిక చదవడమంటే చాలా ఇష్టం. కాఫీని ఇష్టంగా ఆస్వాదిస్తా. నా పిల్లలు పాఠశాలకు వెళ్లడానికి ముందే వారితో కాస్త గడుపుతా.. కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేస్తుంటా. ఈ పనులన్నీ నాకెంతో ప్రత్యేకం. ఈ పనులు ముగిసిన తర్వాత రోజులో నా తొలి సమావేశాన్ని 10 గంటలకల్లా మొదలు పెడుతా. ముఖ్యమైన సమావేశాలన్నీ లంచ్‌కు ముందే కంప్లీట్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటా. దాని తరువాత ఏదైనా ముఖ్యమైన సమావేశాలు ఉంటే వాటిని తరువాతి రోజుకు షెడ్యూల్ చేసుకుంటా. సాయంత్రం ఐదు దాటక పని చేయాలి అనిపించదు.” అని రాసుకొచ్చారు.
రోజుకు ఎనిమది గంటలు నిద్రపోవడానికి ప్రాధాన్యం ఇస్తానని అది శరీరానికి ఎంతో మంచిది అని జెఫ్ బెజోస్ తెలిపారు. ఇక ఆయన దినచర్యపై నెటిజనులు సైతం స్పందిస్తున్నారు. త్వరగా నిద్రపోతే త్వరగా లేస్తాము. అలా అయితే రోజులో చేయాల్సిన పనులను ముందుగానే షెడ్యూల్ చేసుకోవచ్చు. ప్రశాంతంగా ఉంటుంది. ఉదయం సమయంలో ఆలోచనలు కూడా బాగా వస్తాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.