USA: బిలియన్ డాలర్ల స్కామ్‌లో భారతీయులకు జైలు శిక్ష
భారతి సంతతికి చెందిన వ్యాపారవేత్తలు అమెరికాలో బిలియన్ డాలర్ల స్కామ్‌కు పాల్పడ్డారు. దీంతో వాళ్లకు జైలు శిక్ష విధించారు. ఒకప్పుడు చికాగోలో స్టార్టప్ మోసాలకు పాల్పడ్డారని విచారణలో తేలడంతో జైలు శిక్ష విధించారు.
USA: భారతి సంతతికి చెందిన వ్యాపారవేత్తలు అమెరికాలో బిలియన్ డాలర్ల స్కామ్‌కు పాల్పడ్డారు. దీంతో వాళ్లకు జైలు శిక్ష విధించారు. ఒకప్పుడు చికాగోలో స్టార్టప్ మోసాలకు పాల్పడ్డారని విచారణలో తేలింది. ఔట్‌కమ్ హెల్త్ పేరిట రిషి పా, శ్రద్ధా అగర్వాల్‌లు ఓ హెల్త్ మీడియా సంస్థను ఏర్పాటు చేశారు. ఈ కంపెనీ డాక్టర్ల వద్ద స్క్రీన్లు, టాబ్లెట్లను ఏర్పాటు చేసింది. వీటిల్లో పేషేంట్లను టార్గెట్ చేసుకుని వివిధ కంపెనీల మెడికల్ అడ్వర్టైజింగ్ ప్రకటనలు ప్రసారం చేసేది. దీనికి అమెరికాలో మంచి స్పందన లభించింది. దేశవ్యాప్తంగా కంపెనీకి కాంట్రాక్టులు కూడా లభించాయి. దీంతో టెక్, హెల్త్ కేర్ ఇన్వెస్ట్మెంట్లలో ఉన్నత స్థానానికి చేరింది.
భారీ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించగా.. చాలా సంస్థలు ఇన్వెస్ట్ చేశాయి. కానీ రిషి, శ్రద్ధా, సీఎఫ్‌వో బ్రాడ్ పార్టీలు కంపెనీ ఆపరేషనల్, ఫైనాన్షియల్ కార్యకలాపాలను పెంచి చూపిస్తున్నట్లు గుర్తించారు. కంపెనీ డెలివరీ చేయగలిగే స్థాయి కంటే ఎక్కువగా వాణిజ్య ప్రకటనల ఇన్వెంటరీని విక్రయిస్తున్నట్లు తేలింది. షా విలాసవంతమైన జీవనశైలిని చేసి అనుమానలు పెరిగాయి. దీనిపై వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనం కూడా ప్రచురించింది. ఆ తర్వాత గోల్డ్‌మెన్ సాక్స్, ఆల్ఫాబెట్ వంటి ఇన్వెస్టర్లు కోర్టులో కేసు నమోదు చేశారు. మనీ లాండరింగ్ కేసు అతనిపై నమోదైంది. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం జూన్ 26 నుంచి షాకు ఏడేళ్ల ఆరు నెలలు, జూన్ 30 నుంచి శ్రద్ధకు మూడేళ్ల హాఫ్‌వే హౌస్‌లో ఉండేలా, పౌర్డీకి రెండేళ్ల మూడు నెలల జైలు శిక్ష విధించింది.