»20 Masked Robbers Clean Out Indian Jewellery Store In California In Under Three Minute
Robbers : అమెరికాలో భారతీయ నగల దుకాణాన్ని మూడు నిమిషాల్లో దోచేశారు!
అమెరికాలో ఉన్న ఓ భారతీయ నగల దుకాణాన్ని దుండగులు కేవలం మూడే మూడు నిమిషాల్లో దోపిడీ చేశారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ దోపిడీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి. చదివేయండి.
California : ఓ భారతీయ నగల దుకాణాన్ని(Indian Jewellery Store) దోపిడీ చేయడానికి ఏకంగా 20 మంది దుండగులు ప్రయత్నించారు. కేవలం మూడే మూడు నిమిషాల్లో దుకాణాన్ని మొత్తం ఊడ్చి పెట్టేశారు. ఈ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో(California) చోటు చేసుకుంది. అక్కడ మన దేశంలోని పూనేకి చెందిన పీఎన్ జ్యూవెలర్స్ అనే దుకాణం ఉంది. వారు ఈ విషయాన్ని తమ వెబ్సైట్లో పొందుపరిచారు. ఆ వివరాల ప్రకారం…
ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి ఈ నగల దుకాణం దోపిడీ జరిగింది. అందుకు ఏకంగా 20 మంది ముసుగులు ధరించి(Robbers) వచ్చారు. సెక్యూరిటీగా ఉన్న వ్యక్తిని బెదిరించారు. తర్వాత గ్లాస్ డోర్లను బద్దలుగొట్టి లోపలికి దూసుకెళ్లారు. 20 మంది చెరో పక్కా మోహరించారు. గాజు అద్దాల్లో ఉన్న బంగారు నగల్ని తీసుకోవడానికి సుత్తులతో అద్దాలను పగులగొట్టారు. తర్వాత అందినకాడికి ఉన్నన్ని బంగారం నగల్ని సంచుల్లో వేసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఇదంతా చేయడానికి వారు కేవలం మూడు నిమిషాల సమయం మాత్రమే తీసుకోవడం గమనార్హం. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. దోపిడీ జరిగిన తీరు చూస్తుంటే ఈ ప్రాంతంపై షాపుపై బాగా అవగాహన ఉన్న వారు మాత్రమే ఈ పని చేసుంటారని అనుమానిస్తున్నారు. సీసీటీవీ పుటేజీలను పరిశీలించారు. మొత్తం ఇప్పటి వరకు ఐదుగురు అనుమానితుల్ని అరెస్టు చేశారు.