Monsoon : ఈ ఏడాది అనుకున్న దాని కంటే ముందుగానే తొలకరించింది. నైరుతీ రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. ఈశాన్య రాష్ట్రాలను వానలు, వరదలు ముంచెత్తాయి. పెద్ద ప్రాణ నష్టమూ సంభవించింది. అయితే వానలు అలాగే కంటిన్యూ అవుతాయని అంతా భావించారు. కానీ ఉన్నట్లుండి తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పొడి వాతావరణం ఏర్పడింది. ఎండలు మండి పోతున్నాయి. అక్కడక్కడా వాన జల్లులు(Rains ) పడుతున్నప్పటికీ వేడి మాత్రం అలాగే కొనసాగుతోంది.
తొలకరి తర్వాత ఏర్పడిన ఈ వేడి వాతావరణం వల్ల రైతులు వ్యవసాయ పనులను ఇంకా అరకొరగానే మొదలు పెట్టారని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ సమయంలో ఉత్తర భారత దేశంలో రుతుపవనాలు యాక్టివ్గా ఉంటాయని చెప్పింది. మళ్లీ జూన్ చివర నుంచి రుతుపవనాలు దక్షిణ భారత దేశంలో ప్రభావం చూపుతాయని తెలిపింది. జూలై నెలలో భారీగా వర్షాలు(Heavy Rains) పడే అవకాశాలు ఉంటాయని పేర్కొంది.
భారత వాతావరణ గణాంకాలను చూసుకున్నట్లయితే జూన్ 1 నుంచి 16 వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 14 జిల్లాలల్లో లోటు వర్షపాతం నమోదైంది. దీంతో విత్తనాలు నాటిని రైతులకు అవి మొలకెత్తే పరిస్థితులు కనిపించడం లేదు. అయితే జులై నెలలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉండనుంది. జూన్30 తర్వాత సాధారణం కంటే అధికంగా వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Meteorological Department) తెలిపింది.