గత రాత్రి (ఆగస్టు 19) హైదరాబాద్ నగరంలో సంభవించిన భారీ వర్షంతో నగరంలో కొన్ని ఏరియాలు అస్తవ్యస్తంగా మారాయి. రాంపూర్ ప్రాంతంలో ఓ వ్యక్తి వరద నీటి ఉధృతిలో బైక్ నడపగా వర్షపు నీరు దాటికి బైకుతో సహా కొట్టుకుపోయాడు. పక్కనే ఉన్న కాలనీ వాసులు సత్వర స్పందనతో అతన్ని రక్షించారు. ప్రమాదకరమైన పరిస్థితుల్లో అతన్ని సురక్షిత స్థలానికి తరలించడానికి చొరవ తీసుకున్నారు. Read Also: Kolkata Doctor Rape- Murder Case: స...
వచ్చే మూడు రోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. తీవ్ర ఆస్తి నష్టం, పంట నష్టం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో పంటలు పూర్తిగా నీట మునిగాయి. ఈ పరిస్థితి మరో మూడు రోజులు తప్పదని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణాలో మరో మూడు రోజు, ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరుకు తెలంగాణ రాష్ట్ర వ్యా...
తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. చిలికా సరస్సు సమీపంలో ఒడిశా తీరంలోని అల్పపీడనం కొనసాగుతుంది. దీంతో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
భద్రాచలం దగ్గర కురిసిన భారీ వర్షాలకు ఆ ప్రాంతంలో రాకపోకలు బంద్ అయ్యాయి. చర్ల జాతీయ రహదారిపైకి వరద నీరు చేరడంతో రాకపోకలకు తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
తెలంగాణలో ఈరోజు భారీ, రేపటి నుంచి మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. చాలా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
హైదరాబాద్‌కు భారీ వర్షసూచన ఉందని అధికారులు తెలిపారు. జీహెచ్‌ఎంసీ, జలమండలి, డీఆర్‌ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
తెలంగాణ వ్యాప్తంగా రాగల ఐదురోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న మూడు రోజుల్లో ఈ కుండపోత వర్షాలు ఉంటాయని వెల్లడించింది. ఎక్కడెక్కడంటే?
ఏటా వచ్చేదానికంటే ఈ ఏడాది త్వరగానే నైరుతీ రుతుపవనాలు దేశంలో ప్రవేశించినప్పటికీ జూన్‌లో వర్షాలు మాత్రం ఎప్పటిలా కురవలేదు. దీనికి సంబంధించి దిల్లీలోని భారత వాతావరణ కేంద్రం ఏమంటోందంటే..?
ఈ ఏడాది ముందుగానే తొలకరించినప్పటికీ వానలు మాత్రం పెద్దగా పడటం లేదని చెప్పాలి. ఈ పరిస్థితిపై వాతావరణ కేంద్రం ఏమంటోందో తెలుసుకుందాం.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీగా వర్షాలు కురిశాయి. దీంతో అక్కడ లోతట్టు ప్రాంతాలన్నీ జలమయంకాగా వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి. చదివేయండి.
ఆంధ్రప్రదేశ్‌లోకి నైరుతీ రుతుపవనాలు ప్రవేశించాయి. దీంతో ఎండ వేడి నుంచి ప్రజలకు కాస్త ఊరట లభించింది. వర్షాలు సైతం కొన్ని ప్రాంతాల్లో భారీగా కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.
ఈ వేసవి మొదలైన దగ్గర నుంచి బుధవారం రాజస్థాన్‌లో అత్యధికంగా 51 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని ఐఎండీ తెలిపింది. దిల్లీలోనూ ఇంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.