నల్గొండ పట్టణ సమీపంలోని ఎస్ఎల్బీసీ కాలనీ వద్ద చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం పరిశీలించారు. పనులను వేగవంతంగా చేయాలని, వచ్చే విద్యా సంవత్సరం తరగతులు అయ్యేనాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఆమె మ్యాప్‌ను పరిశీలించి, ఎలాంటి లోపాలు లేకుండా పనులను నాణ్యతతో చేపట్టాలని సూచించారు.