KNR: కరీంనగర్లోని పలు అల్ట్రాసౌండ్, ఫీటల్ మెడిసిన్ కేంద్రాలను DMHO డాక్టర్ వెంకటరమణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీసీపీఎన్డీటీ చట్టం ప్రకారం రిజిస్టర్లు, ఫామ్-ఎఫ్ పత్రాలను పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించి లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆసుపత్రి రిజిస్ట్రేషన్లు, వైద్యుల ధ్రువీకరణ పత్రాలను తనిఖీ చేశారు.