ప్రకాశం: సీఎం చంద్రబాబు తనపై ఉన్న కేసులు ఎత్తేయించుకోవటానికే కేంద్రంతో పొత్తులు పెట్టుకున్నాడని ఏమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. వైపాలెంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 8 నెలలకే ఈ ఆర్ధిక సంవత్సరానికి రెవెన్యూ లోటు 163 శాతానికి చేరటం చంద్రబాబు చేతకానితనానికి అద్దం పడుతోందన్నారు.