»Evm Is A Black Box In India Rahul Gandhi Raises Questions On Electoral Process
Rahul Gandhi : ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
లోక్సభ ఎన్నికల సమయంలో వినియోగించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం)పై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈవీఎంలకు సంబంధించిన ఓ సీరియస్ విషయం వెలుగులోకి వచ్చిందని అంటున్నారు.
Rahul Gandhi : లోక్సభ ఎన్నికల సమయంలో వినియోగించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం)పై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈవీఎంలకు సంబంధించిన ఓ సీరియస్ విషయం వెలుగులోకి వచ్చిందని అంటున్నారు. ముంబైలో ఎన్డీయే అభ్యర్థి రవీంద్ర వైకర్ బంధువు మొబైల్ ఫోన్ ఈవీఎంకు లింక్ చేయబడింది. ఈ ఎన్డీయే అభ్యర్థి కేవలం 48 ఓట్ల తేడాతో విజయం సాధించారు. దీని పై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశ్నలు సంధించారు. ఇదే ఘటనను ఆయన ప్రస్తావించారు.
భారత్లోని ఈవీఎంలు బ్లాక్ బాక్స్ అని, వాటిని చెక్ చేయడానికి ఎవరికీ అనుమతి లేదని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ‘ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతపై తీవ్రమైన ఆందోళనలు తలెత్తుతున్నాయి. సంస్థల్లో జవాబుదారీతనం లోపించినప్పుడు ప్రజాస్వామ్యం బూటకం. మోసం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎన్డీయే అభ్యర్థి బంధువు మొబైల్ ఫోన్ ఈవీఎంకు ఎందుకు కనెక్ట్ చేయబడింది? ఓట్ల లెక్కింపు జరుగుతున్న ప్రదేశానికి మొబైల్ ఫోన్ ఎలా వచ్చింది? అనే సందేహాన్ని సృష్టించే అనేక ప్రశ్నలు ఉన్నాయి. దీనిపై ఎన్నికల సంఘం వివరణ ఇవ్వాలి’ అని రాసుకొచ్చారు.
ముంబై నార్త్ వెస్ట్ లోక్సభ స్థానం నుంచి 48 ఓట్ల తేడాతో గెలిచిన శివసేన అభ్యర్థి రవీంద్ర వయ్కర్కు నిందితుడు మంగేష్ పాండిల్కర్ బంధువు అని మహారాష్ట్ర వారాయ్ పోలీసులు దర్యాప్తులో కనుగొన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రానికి అనుసంధానం చేసిన ఫోన్ను ఆయన ఉపయోగిస్తున్నారు. జూన్ 4న నెస్కో సెంటర్లో ఉపయోగించిన ఈవీఎం మిషన్ను అన్లాక్ చేయడానికి ఓటీపీని రూపొందించడానికి ఈ మొబైల్ ఫోన్ ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు.
ఎన్నికల సంఘం (ఈసీ)లో ఎన్కోర్ (పోల్ పోర్టల్) ఆపరేటర్లుగా ఉన్న నిందితులు మంగేష్ పాండిల్కర్, దినేష్ గురవ్లకు వాన్రై పోలీసులు నోటీసును కూడా పంపారు. పోలీసులు ఇప్పుడు మొబైల్ ఫోన్ను ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్)కి పంపారు. తద్వారా మొబైల్ ఫోన్ డేటాను నిర్ధారించడానికి .. ఫోన్లో ఉన్న వేలిముద్రలను కూడా తీసుకుంటారు. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 4న ముంబై నార్త్ వెస్ట్ లోక్సభ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు సందర్భంగా నెస్కో సెంటర్లో ఈ ఘటన జరిగింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో కాంగ్రెస్ దూకుడు పెంచింది.