Gold and Silver Rates Today : బంగారం కొనుక్కోవాలని చూసేవారు రోజు వారీ ధరల్ని సైతం గమనిస్తూ ఉండాల్సిందే. అప్పుడే రేటు తగ్గినప్పుడు కొనుక్కోవడానికి ఆస్కారం ఉంటుంది. దేశీయ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరలు స్థిరంగానే ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర ఆదివారం రూ.74,240గా ఉంది. సోమవారం కూడా మార్కెట్ ప్రారంభ సమయానికి అదే ధర కొనసాగుతోంది.
ప్రొద్దుటూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రధాన నగరాల్లోనూ పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ.74,240గా కొనసాగుతోంది. బంగారు నగల్ని కొనుక్కునేప్పుడు ఈ ధరకు తోడుగా జీఎస్టీ, మజూరీల్లాంటివి యాడ్ అవుతాయని గుర్తుంచుకోవాలి.
దేశీయ మార్కెట్లలో వెండి ధరలు సైతం సోమవారం స్థిరంగా ఉన్నాయి. కిలో వెండి ధర(Silver Rate) ఆదివారం రూ.90,690గా ఉండగా సోమవారం సైతం అదే ధర కొనసాగుతోంది. ప్రొద్దుటూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం తదితర చోట్ల కూడా వెండి ధరలు దాదాపు ఇలాగే కొనసాగుతున్నాయి. వెండి, బంగారం రెండూ ఈ రోజు మార్కెట్ ప్రారంభ సమయానికి స్థిరంగా ఉండటం గమనార్హం.
నేడు అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఔన్సు స్పాట్ గోల్డ్ సోమవారం 11 డాలర్లు తగ్గి 2322 డాలర్లకు చేరుకుంది. ఔన్సు వెండి ధర ప్రస్తుతం 29.21 డాలర్లుగా ఉంది.