ASR: హుకుంపేట మండలం ములియపుట్టు గ్రామంలో రెండు విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా వంగిపోయాయి. వర్షాల ధాటికి, ఈ పాత స్తంభాలు ఏ క్షణాన కూలుతాయోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పెను ప్రమాదం జరగకముందే విద్యుత్ శాఖ అధికారులు స్పందించి, వెంటనే మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.