AP: కడప మేయర్ ఎన్నిక ఇవాళ జరగనుంది. కడప మేయర్ అభ్యర్థిగా పాక సురేష్‌ను నిర్ణయించినట్లు YCP కడప జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఎన్నికకు హాజరుకావాలని YCP కార్పొరేటర్లకు విప్ జారీ చేసినట్లు చెప్పారు. TDPలోకి వెళ్లిన వారికి కూడా విప్ జారీ చేశామని పేర్కొన్నారు. విప్ ఉల్లంఘిస్తే అనర్హులుగా పరిగణించాలని అధికారులను కోరుతామన్నారు.