W.G: డిసెంబర్ 12 ,13 ,14 తేదీల్లో స్కూల్ గేమ్స్ రాష్ట్రస్థాయి సాప్ట్ బాల్ పోటీలను వీరవాసరం మద్దాల రామకృష్ణమ్మ జడ్పీ హైస్కూల్లో నిర్వహిస్తున్నారని హైస్కూల్ హెచ్ఎం శ్రీనివాస్, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి పిఎస్ఎన్ మల్లేశ్వరరావు బుధవారం తెలిపారు. ఈ పోటీల్లో ఉమ్మడి 13 జిల్లాల బాల, బాలికల జట్ల నుంచి సుమారు 416 మంది క్రీడాకారులు హాజరవుతారన్నారు.