»Bihar The Lady Who Cut Her Boyfriends Penis Is A Doctor Who Refused To Marry
Bihar: పెళ్లికి నిరాకరించాడని.. బాయ్‌ఫ్రెండ్ పురుషాంగాన్ని కోసేసిన లేడీ డాక్టర్
బీహార్‌లోని ఓ మహిళా డాక్టర్ తన బాయ్‌ఫ్రెండ్ పురుషాంగాన్ని కోసేసింది. గత అయిదేళ్ల నుంచి కౌన్సిలర్‌తో లేడీ డాక్టర్ రిలేషన్లో ఉంది. పెళ్లి చేసుకోవడానికి కౌన్సిలర్ నిరాకరించగా.. అతని పురుషాంగాన్ని కోసేసింది.
Bihar: The lady who cut her boyfriend's penis is a doctor who refused to marry
Bihar: బీహార్‌లోని ఓ మహిళా డాక్టర్ తన బాయ్‌ఫ్రెండ్ పురుషాంగాన్ని కోసేసింది. వివరాల్లోకి వెళ్తే బాధిత వ్యక్తి మధురా బ్లాక్‌లోని వార్డు నెంబర్ కౌన్సిలర్. గత అయిదేళ్ల నుంచి కౌన్సిలర్‌తో లేడీ డాక్టర్ రిలేషన్లో ఉంది. పెళ్లి చేసుకుందామని కౌన్సిలర్‌ను అడగ్గా అతను మ్యారేజ్‌కి నిరాకరించాడు. అయిన తాను ఆ కౌన్సిలర్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంది. రిజిస్టర్ మ్యారేజ్ అయిన చేసుకోవడానికి సిద్ధమైంది.
ఆ పెళ్లి కోసం కోర్టుకు కూడా వెళ్లింది. కానీ ఆ కౌన్సిలర్ మాత్రం రాలేదు. దీంతో మనస్థాపం చెందిన ఆ లేడీ డాక్టర్ అతన్ని ఇంటికి పిలిచింది. ఇంటికి వచ్చిన ఆ కౌన్సిలర్ పురుషాంగాన్ని కట్ చేసింది. కౌన్సిలర్ అరుపులు విన్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. బెడ్ మీద రక్తపు మడుగులో ఉన్న అతన్ని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఆ లేడీ డాక్టర్‌ది హజిపుర్. మధౌరాలో ఆమె ప్రాక్టీస్ చేస్తోంది. పోలీసులు ఆమె కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.