»Rohit Sharma Ate The Soil On The Barbados Pitch Where The T20 World Cup Finals Took Place Do You Know Why
Rohit Sharma: టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్.. పిచ్‌పై మట్టి తిన్న రోహిత్ శర్మ.. ఎందుకో తెలుసా?
ఎన్నాళ్లనుంచో ఎదురుచూస్తున్న కల రోహిత్ సారథ్యంలో నెరవేరింది. మొత్తానికి 17 ఏళ్ల తరువాత మళ్లీ టీ20 వరల్డ్ కప్ భారత్ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో గ్రౌండ్లో సెలబ్రేషన్స్ చేసుకుంటున్న సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఆ పిచ్‌పై ఉన్న మట్టిని తిన్నాడు. తాజాగా అలా ఎందుకు చేశారో వెల్లడించారు.
Rohit Sharma: టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్.. పిచ్‌పై మట్టి తిన్న రోహిత్ శర్మ.. ఎందుకో తెలుసా?
Rohit Sharma: ఈ సంవత్సరం టీమ్ ఇండియాకు కలిసొచ్చిందనే చెప్పాలి. గత సంవత్సరం వన్డే వరల్డ్ కప్‌ను చేజారింది. అదే పట్టుదలతో ఈ సారి ఐసీసీ ట్రోఫీని ముద్దాడింది. టీ20 వరల్డ్ కప్ ప్రారంభం అయిన మొదటి నుంచి టీమిండియా చాలా కసిగా ఆడింది. లీగ్ దశ నుంచి చాలా ప్లానింగ్‌తో దూసుకొచ్చిన రోహిత్ సేన ఫైనల్స్‌లో కూడా అదే ప్రదర్శనను చూపించింది. దీంతో సఫారీలపై విజయం సాధించింది. ఈ సందర్భంగా ప్లేయర్స్ అందరూ చాలా భావోద్వేగానికి లోనయ్యారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యా ఎమోషనల్ అయ్యారు. కప్ సాధించిన సందర్భంగా మైదానంలో ప్లేయర్స్ అందరూ వేడుక చేసుకుంటుంటే కెప్టెన్ రోహిత్ శర్మ ఆ పిచ్ మీదున్న మట్టిని తిన్నాడు. అయితే అలా ఎందుకు చేశారో తాజాగా వెల్లడించారు.
ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారత్‌కు ఈ వేదిక ఒక విజయాన్ని ఇచ్చింది. బార్బిడోస్ పిచ్ ఎంతో ప్రత్యేకమైనది. ఎన్నో ఏళ్ల కలను ఆ పిచ్‌పై సాధించాము. ఆ మైదానాన్ని, ఆ పిచ్‌ను జీవితాంతం గుర్తించుకుంటానని, దాన్ని తనలో భాగం చేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే మట్టిని నోట్లో వేసుకున్నట్లు తెలిపారు. ఆ మూమెంట్స్ ఎంత ప్రత్యేకమైనవో చెప్పాలంటే నిజంగా మాటలు లేవు. ఈ విజయాన్ని ఇంకా పూర్తిగా సెలబ్రేట్ చేసుకోవాలి. మ్యాచ్ గెలిచిన రోజు టీమ్‌తో కలిసి తెల్లవారే దాక సెలబ్రేట్ చేసుకున్నట్లు రోహిత్ శర్మ వెల్లడించారు. అసలు అదంతా ఒక కలల ఉందని, నమ్మశక్యంగా లేదని అన్నారు.