»Rahul Gandhi Rahul Gandhis Scandalous Speech Ruling Party Demands An Apology
Rahul Gandhi: దుమారం రేపుతున్న రాహుల్ గాంధీ ప్రసంగం.. క్షమాపణ చెప్పాలని అధికార పార్టీ డిమాండ్
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ నిన్న లోక్సభలో చేసిన ప్రసంగం తీవ్ర దుమారం రేపింది. ప్రతిపక్ష హోదాలో మాట్లాడిన అతను కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీతో పాటు హోం మంత్రి అమిత్షా కూడా రాహుల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Rahul Gandhi: Rahul Gandhi's scandalous speech. Ruling party demands an apology
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ నిన్న లోక్సభలో చేసిన ప్రసంగం తీవ్ర దుమారం రేపింది. ప్రతిపక్ష హోదాలో మాట్లాడిన అతను కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జై సంవిధాన్ అంటూ చర్చను ప్రారంభించిన రాహుల్ గాంధీ దాదాపు ఒక గంట 40 నిమిషాల పాటు ప్రసంగించారు. రాహుల్ మాట్లాడుతున్నంత సమయం అధికార పక్షం నుంచి పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు అభ్యంతరం కూడా వ్యక్తం చేశారు.
ప్రధాని మోదీ కూడా రెండుసార్లు ప్రసంగాన్ని అడ్డుకుని రాహుల్ వ్యాఖ్యలను ఖండించారు. ఈ సందర్భంగా రాహుల్ అగ్నివీర్, మైనార్టీ, నీట్ పరీక్షల అక్రమాలు, అహింసాతో బీజేపీని ఎదుర్కోవడం, వివిధ మతాల గురించి కూడా మాట్లాడారు. అలాగే శివుడు ఫొటో చూపించారు. దీంతో అధికార పార్టీ నుంచి తీవ్ర అభ్యంతరం వచ్చింది. సభలో ఇలాంటి మతపరమైన ఫొటోల ప్ర్రదర్శనకు నిబంధనలు అంగీకరించవని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. ఈ వివాదానికి రాహుల్ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ కూడా చేసింది.
రాహుల్ గాంధీ ప్రసంగంపై స్వామి అవధేశానంద్ గిరి స్పందించారు. హిందువులు అహింసావాదులు, ప్రతి ఒక్కరిలో దేవున్ని చూస్తారని, వాళ్ల ప్రపంచం కుటుంబమని, అందరి క్షేమం, ఆనందం, గౌరవం కోసం ఎల్లప్పుడూ ప్రార్థిస్తుంటారు. ఇలాంటి మాటలు చెప్పి మొత్తం సమాజాన్ని అవమానిస్తున్నారని ఆరోపించారు. హిందువుల గురించి రాహుల్ పదే పదే చెబుతున్నారు. ఆ మాటలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలన్నారు.
ఇస్లాంలో అభయముద్ర ఉందని రాహుల్ అన్నారు. కానీ ఇస్లాంలో విగ్రహారాధన ప్రస్తావన లేదని, ఏ విధమైన కరెన్సీ కూడా లేదన్నారు. రాహుల్ తన మాటలను సరిదిద్దుకోవాలని, పూర్తిగా తెలియకుండా మాట్లాడకూడదని కొందరు తెలిపారు. హిందూ, సిక్కు మతానికైనా పూర్తి సమాచారం ఉంటే తప్ప దాని గురించి మాట్లాడకూడదని తెలిపారు. 1984లో సిక్కులపై జరిగిన హింస రాహుల్ గాంధీకి తెలియదని జగ్జోత్ సింగ్ తెలిపారు. చాలా బాధిత కుటుంబాలు ఢిల్లీలోనే నివసిస్తున్నాయని.. అక్కడికి వెళ్లి రాహుల్ ఒక్కసారైన క్షమాపణ చెప్పాలని తెలిపారు. రాహుల్ ప్రసంగంపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా కూడా ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.