»Horoscope Today Todays Horoscope Results 2024 July 2nd Do Not Be Careless In Travel
Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 July 2nd).. ప్రయాణాలలో అశ్రద్ధ వద్దు
ఈ రోజు(2024 July 2nd) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
Horoscope Today: Today's Horoscope Results (2024 July 2nd).. Do not be careless in travel
మేషం
మంచి కాలం. అనుకున్న పని నెరవేరుతుంది. ముఖ్య విషయాల్లో పురోగతి సాధిస్తారు. అందరినీ కలుపుకు పోవడం వల్ల లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు. ప్రయాణాలలో అశ్రద్ధ వద్దు. ఇష్టదైవ ధ్యానం మేలు చేస్తుంది. వృషభం
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో ఫర్వాలేదనిపిస్తుంది. పెద్దల సలహాలు పనిచేస్తాయి. ఆరోగ్యం నిర్లక్ష్యం చేయకండి. గోసేవ చేయడం మంచిది. మిథునం
మీదైన రంగంలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. లాభచంద్ర సంచారం అనుకూల లాభాలను ఇస్తుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఇష్టదైవారాధన మంచిది.
కర్కాటకం
కాలం అన్నివిధాలా సహకరిస్తోంది. గౌరవ సన్మానాలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలున్నాయి. మిత్రజన సహకారం ఉంది. లక్ష్మీస్తుతి శ్రేయస్కరం. సింహం
శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. బంధుమిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త బాధ కలిగిస్తుంది. సుబ్రహ్మణ్యభుజంగ స్తోత్రం పఠించడం మంచిది. కన్య
చేపట్టిన పనులో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తిచేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాగాఆలోచించి ముందుకు సాగాలి. అష్టమ చంద్ర సంచారం అనుకూలంగా లేదు. పనులకు ఆటంకం కలుగకుండా ముందుజాగ్రత్తతో వ్యవహరించాలి. గిట్టనివారు మీ అభిప్రాయాలను ప్రభావితం చేస్తారు. అర్హతకు తగిన ఫలితాలు అందుకుంటారు. శ్రీ వేంకటేశ్వర సందర్శనమ్ ఉత్తమం.
తుల
ఆశించిన ఫలితం దక్కుతుంది. కాలాన్ని మంచి పనులకై వినియోగించండి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. చెడువాటిపైకి మనస్సు మళ్లకుండా జాగ్రత్తపడాలి. దుర్గ స్తుతి ఉత్తమ ఫలితాలనిస్తుంది. వృశ్చికం
మంచిపనులు చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీకు అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. తొలివారితో సానుకూలంగా వ్యవహరిస్తే మేలు. శని ధ్యానం చేయాలి. ధనుస్సు
మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. అకారణ కలహ సూచన. శారీరక శ్రమ పెరుగుతుంది. కొందరి ప్రవర్తనాశైలి మిమ్మల్ని బాధిస్తుంది. అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. విష్ణు నామస్మరణ మంచిచేస్తుంది.
మకరం
కష్టపడి పనిచేస్తే లక్ష్యాలు నెరవేరుతాయి. వృథా ప్రయాణాలు చేస్తారు. ఒక వార్త బాధ కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మీరు ఆశించిన ఫలితాలు రావాలంటే ఎక్కువ శ్రమ పడాలి. బంధువుల అండదండలుంటాయి. హనుమత్ ఆరాధన శుభప్రదం. కుంభం
శ్రేష్ఠమైన కాలం నడుస్తోంది . మొదలు పెట్టిన పనులు చకచకా పూర్తవుతాయి. ఎన్నాళ్ళ నుంచో ఎదురుచూస్తున్నా ఒక ఫలితాన్ని అందుకుంటారు. మీ చుట్టూ సందడి వాతావరణం నెలకొంటుంది. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంటుంది. దైవారాధన మానవద్దు. మీనం
మధ్యమ ఫలితాలున్నాయి. మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు సొంతమవుతాయి. గిట్టనివారు తప్పుదోవ పట్టిస్తారు. చిన్న చిన్న అంశాలను పెద్దవిగా చేసుకోవడం సరికాదు. దుర్గారాధన శుభప్రదం.