»Horoscope Today Todays Horoscope 2024 July 24nd Ishtadevata Naamsmarana Is Auspicious
Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 July 24th)..సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు.
ఈ రోజు(2024 July 24nd) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
మేషం
మీమీరంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది. ధననష్టం కలిగే అవకాశాలు ఉంటాయి. స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అనుకోని ఆపదల్లో చిక్కుకోకునే అవకాశం ఉంది.
వృషభం
శుభకార్యాలు సులభంగా నెరవేరుతాయి. దూర బంధువులతో కలుస్తారు. తద్వారా లాభాలు ఉంటాయి. విదేశయాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తారు.
మిథునం
ఆకస్మిక ధనలాభం ఉంది. కుటుంబంలో ఆనందం తాండవిస్తుంది. బంధు, మిత్రులతో కలిసి ఉంటారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు.
కర్కాటకం
మానసిక ఆనందం లభిస్తుంది. గతంలో వాయిదా వేయబడిన పనులు పూర్తవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని జఠిలమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
సింహం
సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. కొత్త వస్తు, ఆభరణాలను పొందుతారు. ప్రయత్నకార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు అందుకుంటారు.
కన్య
బంధు, మిత్రులతో కలుస్తారు. నూతన గృహనిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శతృబాధలు దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది.
తుల
విదేశయాన ప్రయత్నాలు నెరవేరుతాయి. కుటుంబ కలహాలకు అవకాశం ఇవ్వొద్దు. ఆకస్మిక ధననష్టం ఏర్పడుతుంది. పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చికం
కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. మానసిక ఆందోళనలు ఉంటాయి. శారీరక అనారోగ్యం కలుగుతుంది.
ధనుస్సు
కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. మానసిక చంచలంతో ఇబ్బంది పడతారు. సోమరితనం ఆవహిస్తుంది. పిల్లలపట్ల మిక్కిలి జాగ్రత్త వహిస్తారు. కొన్ని మంచి అవకాశాలను కోల్పోతారు. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉండవు.
మకరం
అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం ఉంది. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. రుణప్రయత్నాలు చేస్తారు.
కుంభం
స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోతారు. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ప్రయాణాల వల్ల లాభాన్ని పొందుతారు. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. నూతన కార్యాలు వాయిదా వేసుకోకతప్పదు.
మీనం
వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జిస్తారు. మంచివారితో స్నేహం మంచిది. అన్నివిశయాల్లో సుఖమే లభిస్తుంది. ధనలాభం ఉంది. బంధు, మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు.