Gold and Silver Rates Today : బంగారం ధరలు వరుసగా రెండో రోజూ స్థిరంగా ఉన్నాయి. శనివారం ఉన్న ధరలే సోమవారం, మంగళవారం సైతం దాదాపుగా కొనసాగుతున్నాయి. అతి స్వల్పంగా మాత్రమే పెరుగుదలను నమోదు చేసుకున్నాయి. సోమవారం రూ.7 పెరగ్గా, మంగళవారం సైతం రూ.31 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర నేడు రూ.73,945గా నమోదైంది.
విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ లాంటి చోట్లా పసిడి ధర(Gold Rates) దాదాపుగా రూ.73,945గా ఉంది. అయితే బంగారం కొనుక్కోవాలని అనుకునే వారు మాత్రం ఈ ధరలకు అదనంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ధరతో పాటుగా జీఎస్టీ, మజూరీలను కూడా దుకాణదారుడికి చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి వినియోగదారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.
దేశీయ మార్కెట్లలో వెండి ధర(Silver Rate)లు సోమవారం భారీగా పెరిగి మళ్లీ 90 వేల పైకి చేరాయి. మంగళవారం రూ.527 తగ్గాయి. దీంతో కిలో వెండి ధర రూ.90,506కు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్‌లాంటి చోట్ల కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధరలై సైతం దేశీయ మార్కెట్ మాదిరిగానే స్థిరంగా ఉన్నాయి. మంగళవారం 2327 డాలర్లకు చేరుకున్నాయి. అలాగే ఔన్సు వెండి ధర 29.33 డాలర్లుగా ఉంది.