»Anant Ambani Wears A Rare %e2%82%b96 9 Crore Watch For Temple Visit Before His Wedding With Radhika Merchant
Anant Ambani : అనంత్ అంబానీ వాచ్ ధర తెలిసి అంతా షాకైపోతున్నారు!
అనంత్ అంబానీ వివాహానాకి ముందు సోమవారం ఓ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ఆయన ఓ అరుదైన వాచ్‌ని ధరించారు. ఇప్పుడు ఆ వాచ్ సంగతులు అందరికీ ఆసక్తిగా మారాయి. అవేంటంటే?
Anant Ambani wears a rare watch :
అంబానీ కుటుంబంలో అంతా ఏం ధరించినా, ఏం వేసుకున్నా అది టాకాఫ్ ద టౌన్ అన్నట్లుగానే ఉంటుంది. భారత్‌లో అత్యంత సంపన్నవంతులైన వీరి కుటుంబంలో పెళ్లంటే ప్రతిదీ చిత్రమే. ప్రతిదీ వార్తే అన్నట్లుగా ఉంటుంది. ఈనెల 12న ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ(Anant Ambani), రాధికా మర్చెంట్ల వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో అనంత్ సోమవారం మహారాష్ట్రలోని నెరాల్లో ఉన్న కల్కి ఆలయాన్ని( temple visit) సందర్శించారు. అక్కడకి వచ్చినప్పుడు ఆయన ధరించిన వాచ్ ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
రిచెర్డ్ మిల్లే సంస్థకు చెందిన అరుదైన వాచ్ అది. ఇప్పటి వరకు అలాంటి వాచ్‌లను(watch) సంస్థ 18 మాత్రమే తయారు చేయించింది. అందులో ఒక దాన్ని ఇప్పుడు అనంత్ అంబానీ ధరించి కనిపించారు. దీని ధర ఎంత ఉంటుందా? అని ఆరా తీసిన నెటిజన్లకు షాకయ్యే సమాధానం వచ్చింది. దీని ధర ఏకంగా రూ.6.9 కోట్లు. ఆయన దగ్గర ఇదే కాదు. ఇలాంటి పెద్ద పెద్ద బ్రాండ్లకు చెందిన వాచీలు చాలానే ఉన్నాయి. మొన్నామధ్య జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో ఆయన ధరించిన వాచ్ అత్యంత ఖరీదైనదని అప్పట్లో వార్తలు వచ్చాయి.
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో ఆయన పెట్టుకున్న వాచ్ ధర ఏకంగా రూ.18 కోట్లు. అనంత్ కోసం ఈ వాచ్‌ని అంబానీ కుటుంబం ప్రత్యేకంగా తయారు చేయించింది. దీన్ని పాటెక్ ఫిలిప్(Patek Philippe) అనే ప్రీమియం వాచ్‌ల కంపెనీ తయారు చేసింది. రెండు ఇండిపెండెంట్ డైల్స్ ఉన్నాయి. అలాగే ఆరు పేటెంట్ ఇన్నోవేషన్లను సైతం కలిగి ఉంది. వైట్ గోల్డ్ కలర్లో చూట్టానికి ఈ వాచ్ ఎంతో ప్రీమియం లుక్‌లో కనిపించింది.