»Anant Ambani Radhika Merchants Grand Sangeet Ceremony Uncut Witness Every Magical Moment
Sangeeth: అనంత్, రాధిక సంగీత్‌లో డాన్స్ చేసిన అంబానీ కుటుంబం.. హాజరైన సెలబ్రిటీలు
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల వివాహానికి ముందు సంగీత్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. శుక్రవారం జరిగిన సంగీత్ ఫంక్షన్ మొత్తంలో అంబానీ కుటుంబం మొత్తం డ్యాన్స్ చేసి అలరించింది. ఆ వీడియోని మీరిక్కడ చూసేయొచ్చు.
Anant Ambani Radhika Merchant Sangeeth: అంబానీ ఇంట పెళ్లి వేడుకలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న తనయుడు అనంత్ అంబానీకి(Anant Ambani), రాధిక మర్చంట్‌కు ఈ నెల 12వ తేదీన వివాహం జరగనుంది. అంతకు ముందుగా శుక్రవారం వీరి సంగీత్(Sangeet) ఫంక్షన్ ఘనంగా జరిగింది. ముంబయిలోని జియో సెంటర్ ఈ గ్రాండ్ ఈవెంట్‌కు వేదిక అయ్యింది.
ఈ వేడుకలో అనంత్(Anant) నేవీ బ్లూ కలర్ మీద బంగారు వర్ణంలో వర్క్ వచ్చిన సూట్ ధరించి మెరిసిపోయారు. అలాగే రాధిక కూడా పేస్ట్రల్ కలర్ లెహంగాలో అందంగా కనిపించారు. ఈ వేడుకలో ఇరు కుటుంబాల వారు, పెద్దలే కాకుండా పలువురు బాలీవుడ్ ప్రముఖులు సైతం తళుక్కుమన్నారు. రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే, జాన్వీ కపూర్, సారా అలీఖాన్, అనన్య పాండే, నేహ శర్మ, రిచా సిన్హా, ఆయేషా శర్మ, దిశా పటానీ, షారూఖ్ ఖాన్, అలియాభట్, రణవీర్‌కపూర్, దీపిక పదుకొనే లాంటి ప్రముఖులంతా ఈ ఫంక్షన్‌కు హాజరై సందడి చేశారు. వీరు కూడా డ్యాన్సులు చేసి అలరించారు.
ఇక సంగీత్ వేడుకలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది మాత్రం అంబానీ కుటుంబ సభ్యులు చేసిన డ్యాన్స్ పర్ఫామెన్స్ అనే చెప్పాలి. ముఖేష్ అంబానీ, నీతా అంబానీ, ఆకాష్ అంబానీ, ఇషా, అనంత్, రాధిక.. తదితర కుటుంబ సభ్యులంతా కలిసి నృత్యం చేసి అలరించారు.