»Calendar Song Released From Kamal Haasan And Shankars Movie Bhartiyadudu 2
Calendar song: భారతీయుడు 2 నుంచి క్యాలెండర్ సాంగ్.. ఇలా తీయడం శంకర్‌కు మాత్రమే సాధ్యం
కమల్ హాసన్, క్రియేటీవ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్ర ఇండియన్-2. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ సాంగ్ విడుదలైంది. ఈ సాంగ్‌లో 2017 ప్రపంచ సుందరి విన్నర్ డెమి లీ టెబో నటించింది. తన హోయలతో పాటను నెక్ట్స్ లెవల్‌కు తీసుకుకెళ్లింది. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Calendar song released from Kamal Haasan and Shankar's movie Bhartiyadudu-2
Calendar song: ఉలగనాయగన్ కమల్ హాసన్ ప్రధాన పాత్రలో క్రియేటీవ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారతీయుడు చిత్రం ఓ సంచలనం. ఆ సంచనాన్ని రెట్టింపు చేయడానికి వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఇండియన్-2. తెలుగులో భారతీయుడు-2 పేరుతో విడుదల అవుతుంది. ఈ చిత్రం నుంచి వరుస అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. అందులో భాగంగా ఓ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటలో 2017 మిస్ యూనివర్స్ విన్నర్ డెమి లీ టెబో నర్తించింది. నిజానికి సాంగ్స్ మేకింగ్‌లో శంకర్‌కు ఒక ప్రత్యేకమైన పేరు ఉంది. అందుకు తగ్గట్టుగానే ఈ పాటను మలిచారు. విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. చంద్రబోస్ రాసిన ఈ పాటను శ్రావణ భార్గవి ఆలపించారు.
సెన్సెషన్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ వండర్ క్రియేట్ చేశాడు. ఇక చిత్రం కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎంతో ఆత్రంగా ఎదరుచూస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్, సిద్దర్థ్ వంటి స్టార్ కాస్టింగ్ ఉన్నారు. ఇటీవలే విడుదలైన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. క్యాలెండర్ సాంగ్ సైతం ప్రేక్షకులను కట్టిపడేసింది. ముఖ్యంగా విజువల్ వండర్‌గా సాంగ్ ఉందని చెప్పవచ్చు.