»Bharathidudu 2 Has Failed Shankar In The Field For Game Changer
Bharathidudu 2: భారతీయుడు 2′ పనైపోయింది.. ‘గేమ్ ఛేంజర్’ కోసం రంగంలోకి శంకర్?
'కల్కి' రిలీజ్ అయిన రెండు వారాల తర్వాత భారీ అంచనాలతో థియేటర్లోకి వచ్చింది 'భారతీయుడు 2' సినిమా. అయితే.. ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. దీంతో.. ఇప్పుడు గేమ్ ఛేంజర్ కోసం రంగంలోకి దిగాడు శంకర్.
Bharathidudu 2' has failed.. Shankar in the field for 'Game Changer'?
Bharathidudu 2: స్టార్ డైరెక్టర్ శంకర్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. కానీ భారతీయుడు 2 సినిమాతో డిసప్పాయింట్ చేశాడు. 28 ఏళ్ల తర్వాత వచ్చిన సీక్వెల్ అవడంతో.. ప్రేక్షకులకి అవుట్ డేటెడ్ కథగా అనిపించింది. దీంతో.. మిక్స్డ్ టాక్‌తోనే సరిపెట్టుకుంది భారతీయుడు 2. వసూళ్లు కూడా రోజు రోజుకి తగ్గుతునే ఉన్నాయి. మొదటి రోజు కలెక్షన్స్ పర్వాలేదు అనిపించినా.. ఆ తర్వాత మౌత్ టాక్ డివైడ్‌గా ఉండటంతో వసూళ్ల పై ఆ ఇంపాక్ట్ గట్టిగా పడింది. ఫస్ట్ వీకెండ్లో మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా.. 55 కోట్ల వరకు షేర్, 112 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు చేసినట్టుగా తెలుస్తోంది. తొలి రోజు 26 కోట్ల నెట్ రాబట్టిన భారతీయుడు 2 కలెక్షన్స్ రెండో రోజు 18 కోట్లకు పడిపోగా.. మూడో రోజు కేవలం 15 కోట్ల నెట్ మాత్రమే రాబట్టినట్టుగా చెబుతున్నారు.
అందులోనూ తమిళ మార్కెట్ నుంచే దాదాపు 80 శాతం వసూళ్లు అయ్యాయట. అయినా.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అవాలి అంటే.. మరో 100 కోట్లకు పైగా రాబట్టాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఫస్ట్ వీకెండ్లోనే ఈ రేంజ్ వసూళ్లు ఉంటే.. సోమవారం నుంచి హ్యూజ్ డ్రాప్ ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు. దీంతో.. దాదాపుగా భారతీయుడు 2 పనైపోయినట్టే. అందుకే.. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా గేమ్ చేంజర్ కోసం రంగంలోకి దిగాడు శంకర్. గేమ్ ఛేంజర్ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. రామ్ చరణ్ తన పోర్షన్ షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసినప్పటికీ.. ఇంకా 10-15 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఇక భారతీయుడు 2 రిలీజ్ అయిపోయింది కాబట్టి.. తాజాగా శంకర్ హైదరాబాద్‌లో అడుగు పెట్టాడు. గేమ్ ఛేంజర్ బ్యాలెన్స్ షూటింగ్‌కి సంబంధించిన లొకేషన్స్ రెక్కీ చేస్తున్నట్టుగా సమాచారం. ఏదేమైనా.. మెగా ఫ్యాన్స్ మాత్రం గేమ్ ఛేంజర్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మరి ఈసారి శంకర్ ఏం చేస్తాడో చూడాలి.