యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. అందుకే.. తానే నిర్మాతగా మారి డిఫరెంట్ టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. తాజాగా 'క' అనే సినిమా టీజర్ రిలీజ్ చేశారు. మరి టీజర్ ఎలా ఉంది.
Kiran Abbavaram: Kiran Abbavaram 'Ka' Teaser Release.. Stronger This Time?
Kiran Abbavaram: కెరీర్ స్టార్టింగ్‌లో మంచి హిట్స్ అందుకున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. ఆ తర్వాత మాత్రం డీలా పడ్డాడు. బడా బడా సంస్థల్లో అవకాశాలు అందుకున్నప్పటికీ.. సరైన హిట్స్ మాత్రం అందుకోలేకపోయాడు. అందుకే.. ఈ సారి కాస్త గ్యాప్ తీసుకొని సాలిడ్ హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు. ‘క’ అనే టైటిల్‌తో డిఫరెంట్ అటెంప్ట్ చేస్తున్నాడు. అయితే.. ఈసారి భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో తనే నిర్మాతగా ఈ సినిమా చేస్తున్నాడు. తాజాగా కిరణ్ అబ్బవరం పుట్టిన రోజు సందర్భంగా ‘క’ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.
ఇక ఈ టీజర్ చూసిన తర్వాత.. కిరణ్ ఈసారి గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడని చెప్పాలి. టీజర్లో కిరణ్ అబ్బవరం పోస్ట్‌మాన్‌గా కనిపించనున్నట్టుగా చూపించారు. అయితే.. పన్నెండు రాశుల సింబల్స్ ఉన్న ఒక ప్రత్యేక మిషన్ మాత్రం టీజర్లో ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎవరు నువ్వు.. ఎక్కడి నుంచి వచ్చావ్.. పక్క వాళ్ళ ఉత్తరాలు చదివే అలవాటు ఏంటి? నీకంటూ ఎవరూ లేరా.. అంటూ ఆసక్తికరంగా ఈ టీజర్ కట్ చేశారు. నాకు తెలిసి నేను మంచి.. నాకు తెలియని నేను.. అనే డైలాగ్, యాక్షన్ సీక్వెన్స్, జాతర, తోలుబొమ్మలాట వంటివి సినిమా పై మంచి హైప్ క్రియేట్ చేసేలా ఉన్నాయి.
తోడేలువురా నువ్వు.. అంటూ చివరలో వచ్చే డైలాగ్‌తో కిరణ్ అబ్బవరంను ఇంట్రడ్యూస్ చేశారు. అయితే.. ఈ టీజర్లో చూపించినట్టుగా.. క్రిష్ణగిరి గ్రామానికి.. ఆంజనేయస్వామి, ఉత్తరాలు, అమ్మవారి జాతరకు లింక్ ఏంటనే సస్పెన్స్ క్రియేట్ చేశారు. కిరణ్ అబ్బవరం లుక్ కూడా అదిరింది. మొత్తంగా.. ఈ టీజర్ ఆసక్తికరంగా, ట్విస్ట్‌లతో ఆకట్టుకునేలా ఉంది. నిర్మాణ విలువలతో పాటు.. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఈ సినిమాకు సుజిత్, సందీప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏదేమైనా.. ఈ చిత్రంతో హిట్ కొట్టేలానే ఉన్నాడు అబ్బవరం.