ఈసారి కొడితే కుంభ స్థలాన్నే కొట్టాలి.. అని భారీగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు మంచు విష్ణు. కన్నప్ప సినిమాను తన మార్కెట్‌కు మించిన బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయగా.. ప్రభాస్ షాట్‌కు అంతా ఫిదా అయ్యారు.
Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పను భారీగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో టాలీవుడ్ సహా పలు ఇండస్ట్రీలకు చెందిన స్టార్ హీరోలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మోహన్ బాబు, మోహన్ లాల్‌తో పాటు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. దీంతో కన్నప్ప పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవలె ప్రభాస్ ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ చేశాడు. ఈ సందర్భంగా మంచు విష్ణు చేసిన ట్వీట్ సోషల్ మీడియాను షేక్ చేసింది. ప్రభాస్.. కన్నప్ప షూటింగ్లో జాయిన్ అయ్యాడని, జస్ట్ ఒక ఒక ప్రీ లుక్ లాంటి పోస్టర్ రిలీజ్ చేయగా.. నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అయింది. ఇక లేటెస్ట్గా కన్నప్ప టీజర్ రిలీజ్ చేశాడు విష్ణు. ఈ టీజర్ సినిమా పై మరిన్ని అంచనాలను పెంచేసేలా ఉంది. మంచు విష్ణు ఎంట్రీ, ఆ యుద్ధ సన్నివేశాలు అదిరిపోయాయి. విష్ణు చెప్పినట్టుగా విజువల్ గ్రాండియర్‌గా ఉంది టీజర్.
అయితే.. ఈ టీజర్లో ప్రభాస్‌కు సంబంధించిన షాట్స్ పెద్దగా చూపించలేదు. కానీ ఒకే ఒక్క షాట్ మాత్రం టీజర్లో ఉంది. అది కూడా.. జస్ట్ ప్రభాస్ ఐ షాట్ మాత్రమే. ఈ ఒక్క షాట్‌కు సోషల్ మీడియా షేక్ అయిపోతోంది. టీజర్ మొత్తం ఎలా ఉన్నా.. ఒక సెకను కూడా లేని ప్రభాస్ ఐ షాట్ మాత్రం హైలెట్‌గా నిలిచిందని.. ఆ షాట్‌ను తెగ వైరల్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఇక టీజర్ ఎండ్‌లో అక్షయ్ కుమార్‌ని శివుడు పాత్రలో చూపించారు. అది కూడా ఐ షాట్‌నే చూపించారు. అలాగే.. ఈ టీజర్లో మిగతా స్టార్ క్యాస్టింగ్‌ను కూడా చూపించారు. మోహన్ లాల్, కాజల్ అగర్వాల్‌కు సంబందించిన షాట్స్ కూడా కట్ చేశారు. దీంతో.. ప్రస్తుతం కన్నప్ప టీజర్ నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది.