అసలు ఓజి సినిమా పై ఉన్న హైప్‌కి ఓటిటి డీల్ అవకపోవడం ఏంటి? అనేది అర్థం కాకుండా పోయింది. కానీ ఫైనల్‌గా ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్‌కు భారీ ఓటిటి డీల్ జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రముఖ సంస్థ ఓజి రైట్స్ దక్కించుకుందని సమాచారం.
OG: ప్రస్తుతం పవన్ చేస్తున్న సినిమాల్లో ఓజి పై ఎక్కడా లేని అంచనాలున్నాయి. సుజీత్ ఈ సినిమాను పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన హంగ్రీ చీతా గ్లింప్స్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పించింది. సెప్టెంబర్ 27న ఓజి రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. కానీ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందని వినిపిస్తోంది. అయితే.. ఈ సినిమా వాయిదాకు ఓటిటి డీల్ కూడా ఒక కారణమని ప్రచారంలో ఉంది. పవన్ సినిమాకు ఓటిటి డీల్ జరగకపోవడం ఏంటనేది? హాట్ టాపిక్‌గా మారింది. మేకర్స్ భారీగా డిమాండ్ చేస్తుండడంతో.. ఓటిటి డీల్ ఇప్పట్లో జరిగేలా లేదనుకున్నారు. కానీ ఇప్పుడు భారీ డిజిటల్ డీల్ జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం పవర్ స్టార్ నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతున్నాడు. జనసేన భారీ విజయంతో దేశ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.
దీంతో ఓజి డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటిటి ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఏకంగా 90 కోట్లకు దక్కించుకున్నట్టుగా సమాచారం. ఇదే నిజమేతే.. పవన్ కెరీర్లో ఇదే హైయెస్ట్ ఓటిటి డీల్ అని చెప్పాలి. అయితే.. ఓజి స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ సంబంధించి అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాను డీవివి ఎనెర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవివి దానయ్య గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తుండగా.. ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నాడు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకుంది. పవన్ డేట్ ఇస్తే.. గుమ్మడికాయ కొట్టేసి అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు. మరి ఓజి ఎలా ఉంటుందో చూడాలి.