»Kalki Advance Bookings Rush A New Record In One Day
Kalki: ‘కల్కి’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ.. ఒక్క రోజులోనే కొత్త రికార్డు!
కల్కి సినిమా పై ఇంకా సాలిడ్ బజ్ రాలేదు. ఒక్కసారి ట్రైలర్ రిలీజ్ అయితే, సినిమా పై ఓ అంచనాకు రానున్నారు ఆడియెన్స్. కానీ అప్పుడే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు అయ్యాయి. కొత్త రికార్డులు కూడా క్రియేట్ చేస్తోంది కల్కి.
'Kalki' advance bookings rush.. a new record in one day!
Kalki: ఆరు వేల సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లడానికి నాగ్ అశ్విన్ చేసిన ప్రయత్నం ఎలా ఉంటుందో.. ట్రైలర్‌తో తేలిపోనుంది. జూన్ 10న కల్కి ట్రైలర్ బయటికి రానుంది. ఇప్పటికే దేశవ్వాప్తంగా బుజ్జిని వెంటేసుకొని ప్రమోట్ చేస్తున్నారు మేకర్స్. బాహుబలితో పాన్ ఇండియా సినిమాలకు పునాది వేసిన ప్రభాస్.. కల్కితో పాన్ వరల్డ్‌కు బాట వేయబోతున్నాడు. ఈ సినిమాతో డార్లింగ్ హాలీవుడ్లో సెటిల్ అవపోవడం గ్యారెంటీ అనేలా కల్కి రాబోతోంది. జూన్ 27న కల్కి రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఓవర్సీస్లో ఒక రోజు ముందుగా, అంటే జూన్ 26నే కల్కి ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో.. అక్కడ బుకింగ్స్ ఓపెన్ చేయగా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. జస్ట్ బుకింగ్స్ మొదలైన 4 గంటల్లోనే టికెట్స్ అన్నీఅయిపోయాయి. దాదాపు 4200 టికెట్స్ హాట్ కేకుల్లా అమ్మడుపోయాయి.
దీంతో.. తొలి రోజు ఏకంగా 5 వేల అమెరికన్ డాలర్స్ వసూళ్లు వచ్చాయి. అంటే, భారత కరెన్సీలో సుమారు కోటి 10 లక్షల రూపాయలన్న మాట. అంతేకాదు, ఒక్క రోజులో అడ్వాన్స్ బుకింగ్స్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా ‘కల్కి 2898 ఎడి’ కొత్త రికార్డును నెలకొల్పింది. ఇక సాలిడ్ బుకింగ్స్ ఉండడంతో.. థియేటర్ల సంఖ్య పెంచే పనిలో ఉన్నారు డిస్ట్రిబ్యూటర్స్. సినిమా రిలీజ్‌కు ఇరవై రోజుల ముందే ఈ రేంజ్ బుకింగ్స్ ఉంటే, ఇక రిలీజ్ టైం దగ్గర పడితే ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందులోను.. ఇండియాలో బుకింగ్స్ స్టార్ట్ అయితే మామూలుగా ఉండదు. అసలే సమ్మర్లో పెద్ద సినిమాలు రాలేదు. కల్కి థియేటర్లోకి వస్తే దాహం తీర్చుకోవడానికి రెడీగా ఉన్నారు ఆడియెన్స్. మరి.. రిలీజ్‌కు ముందే రికార్డ్స్ సృష్టిస్తున్న కల్కి.. రిలీజ్ అయ్యాక ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.