»Rerelease Of Cult Film A Starring Sensational Star Upendra
Rerelease: సెన్సెషనల్ స్టార్ ఉపేంద్ర నటించిన కల్ట్ ఫిల్మ్ ‘ఏ చిత్రం రీరిలీజ్
ఇండస్ట్రీలో అంతా రీరిలీజ్‌ల ట్రెండ్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఉపేంద్ర నటించిన మరో సినిమా విడుదలకు సిద్దం అయింది. ఇదివరకే రా చిత్రం విడుదల అయి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు ఏ చిత్రం ముస్తాబు అవుతోంది.
Rerelease of cult film A starring sensational star Upendra
Rerelease: ఇండస్ట్రీలో ఇప్పుడు అంతా 4కే రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతుంది. ఓల్డ్ బ్లాక్ బస్టర్ మూవీస్‌ను మరొక్కసారి హై క్వాలిటీతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అందులో భాగంగానే కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర నటించిన ఏ అనే చిత్రాన్ని రీరిలీజ్ చేస్తున్నారు. 1998లో విడుదలైన ఏ సినిమా ఓ కల్ట్ ఫిల్మ్‌గా కన్నడ ఇండస్ట్రీలో నిలిచింది. అక్కడ సూపర్ హిట్ కావడంతో తెలుగులో సైతం విడుదల చేశారు. అప్పట్లో ఈ చిత్రం 100 రోజులు ప్రదర్శించింది. అలాంటి ఏ చిత్రం ప్రేక్షకుల కోసం జూన్ 21 విడుదల అవుతుంది.
కన్నడ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసిన సినిమా ఏ(A) బుద్దిమంతులకు మాత్రమే అనేది శీర్షిక. ఈ చిత్రంలో ఉపేంద్ర సరసన చాందినీ నటించారు. తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం కేవలం కన్నడలో 1998లోనే 20 కోట్లకు పైగా వసూల్ చేసి ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేసింది. అంతటి కల్ట్ ఫిల్మ్ జూన్ 21 న తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుందని సినిమా ప్రీయులు, ఉపేంద్ర ఫ్యాన్స్ తెగ సంబరం చేసుకుంటున్నారు. ఉపేంద్ర చేసే చిలిపి చేస్టలను తెరపై చూడాలని ఉవ్విల్లూరుతున్నారు.