నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటిది డెడ్లీ కాంబినేషన్ అని చెబుతూ.. ఇప్పటి వరకు మూడు సినిమాలొచ్చాయి. వాటిలో లెజెండ్ సినిమా రీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. దీంతో థియేటర్ బ్లాస్టింగ్‌కు రెడీ అవుతున్నారు ఫ్యాన్స్.
Legend: మామూలుగా.. అది ఏ హీరో సినిమా అయిన సరే.. ప్రతి థియేటర్లో జై బాలయ్య స్లోగాన్స్ ఓ రేంజ్లో వినిపిస్తుంటాయి. ఇక బాలయ్య సినిమా రిలీజ్ అయితే.. థియటర్లు దద్దరిల్లిపోవడం గ్యారెంటీ. అందులోను రీ రిలీజ్ సినిమా అంటే.. బాలయ్య ఫ్యాన్స్ చేసే హంగామా మామూలుగా ఉండదు. ఇప్పటికే కొన్ని సినిమాల రీ రిలీజ్‌తో రచ్చ చేసిన బాలయ్య ఫ్యాన్స్.. ఇప్పుడు లెజెండ్ సినిమాతో దుమ్ములేపడానికి రెడీ అవుతున్నారు. బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన రెండో సినిమా లెజెండ్.. సంహా సినిమా కంటే డబుల్ జోష్‌లో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించింది. 2014లో రిలీజ్ అయిన ఈ సినిమా 2017 వరకు థియేటర్లలో ఆడింది. దాదాపు 31 సెంటర్లలో వంద రోజులు ఆడింది.
మరో రెండు సెంటర్లలో 175 రోజులు సక్సెస్ ఫుల్‌గా రన్ అయింది. ఓ థియేటర్లో అయితే ఏకంగా 1000 రోజులకు పైగా ఆడి రికార్డుకెక్కింది లెజెండ్. ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు.. వంటి పవర్ ఫుల్ డైలాగ్స్‌తో గూస్బంప్స్ తెప్పించింది ఈ సినిమా. ఈ సినిమాతోనే జగపతిబాబు విలన్‌గా మారాడు. అలాంటి సినిమా ఇప్పుడు మళ్లీ థియేటర్లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. లెజెండ్ రిలీజ్ అయి ఈ ఏడాదితో సరిగ్గా 10 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా మేకర్స్ ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మార్చి 30న గ్రాండ్‌గా లెజెండ్ రీ రిలీజ్ రిలీజ్ కానుంది. ఇప్పటికే రీరిలీజ్ ట్రైలర్ కూడా విడుదల చేశారు. మరి రీ రిలీజ్‌తో లెజెండ్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.