ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'దేవర' టైటిల్‌తో భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది హాట్ బ్యూటీ జాన్వీ కపూర్. తాజాగా ఈ సినిమా సెట్స్‌లోకి జాయిన్ అయింది తంగం.
Janhvi Kapoorఫ జనతా గ్యారేజ్ కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ.. ఈసారి భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నారు ఎన్టీఆర్, కొరటాల శివ. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ రెండు పార్టులుగా విడుదల కానుంది. దేవర పార్టు 1 అక్టోబర్ 10న గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతోంది. అక్కడ ఓ సాంగ్‌తో పాటు కొన్ని కీలక యాక్షన్స్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు. అందుకు సంబంధించిన వర్కింగ్ స్టిల్‌ను రిలీజ్ చేయగా.. అదిరిపోయే లుక్‌లో ఉన్నాడు యంగ్ టైగర్. అలాగే.. సముద్రంలో ఎన్టీఆర్ నడుచుకుంటూ వస్తున్న లీకేజీ వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది.
ఇక లేటెస్ట్గా హీరోయిన్ జాన్వీకపూర్ గోవా షెడ్యూల్లో జాయిన్ అయింది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేసుకుంది జాన్వీ. కొన్ని రోజుల పాటు జరుగనున్న ఈ చిత్రీకరణలో తారక్, జాన్వీకపూర్ మధ్య వచ్చే కీలక సన్నివేశాలతో పాటు ఓ సాంగ్ కూడా షూట్ చేయనున్నారట. ఈ సినిమాలో జాన్వీకపూర్ తంగం అనే పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే తంగం లుక్ రివీల్ చేయగా.. పల్లెటూరి అమ్మాయిగా అదిరిపోయింది జాన్వీ. దీంతో దేవర, తంగం పెయిర్ కోసం వెయిట్ చేస్తున్నారు నందమూరి అభిమానులు. ఇక ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ భైర పాత్రలో వినల్‌గా నటిస్తుండగా.. కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో దేవర తెరకెక్కుతోంది. మరి దేవర ఎలా ఉంటుందో చూడాలి.