Allu Arjun: అరుదైన గౌరవం.. దుబాయ్ ఫ్లైట్ ఎక్కిన అల్లు అర్జున్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకోవడంతో పాటు.. ఏకంగా నేషనల్ అవార్డ్ కూడా సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు మరో అరుదైన గౌరవం అందుకోవడానికి దుబాయ్ వెళ్లాడు.
A rare honor.. Allu Arjun boarded the Dubai flight!
Allu Arjun: పుష్ప సినిమాతో ఎన్నెన్నో రికార్డ్స్ క్రియేట్ చేశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఏకంగా పుష్పకు సినిమాకు గాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకొని.. తెలుగు సినీ చరిత్రను తిరగరశాడు బన్నీ. అలాగే.. ఈ సినిమా తర్వాత మరో గౌరవం అందుకున్నాడు ఐకాన్ స్టార్. దుబాయ్‌లోని ప్రతిష్టాత్మక ‘మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం’లో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే విగ్రహం రెడీ అయింది. ఈ విగ్రహ ఆవిష్కరణ మార్చి 28వ తేదీన జరగనుంది. ఈ ఈవెంట్ కోసం అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌కు బయలుదేరారు. రెండు రోజుల ముందే భార్య స్నేహ, పిల్లలు అల్లు అర్హ, అల్లు అయాన్లతో కలిసి హైదరాబాద్ నుంచి దుబాయ్‌కు పయనమయ్యారు బన్నీ.
అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్లాక్ టీ షర్ట్, ప్యాంట్, బ్లాక్ క్యాప్ ధరించి ఐకాన్ స్టార్ మరింత స్టైలిష్‌గా కనిపించారు. ఇక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఈ ఘనత సాధించిన మూడో సౌత్ హీరోగా రికార్డ్ క్రియేట్ చేశాడు అల్లు అర్జున్. ఇప్పటికే టాలీవుడ్‌కు చెందిన రెబల్ స్టార్ ప్రభాస్, సూపర్‌స్టార్ మహేశ్‌బాబు మైనపు విగ్రహాలను మేడమ్ టుస్సాడ్స్‌లో మ్యూజియంలో ఏర్పాటు చేశారు. అయితే.. ప్రభాస్, మహేష్ విగ్రహాలను లండన్ మ్యూజియంలో ఏర్పాటు చేయగా.. అల్లు అర్జున్ విగ్రహాన్ని దుబాయ్‌లో ఏర్పాటు చేస్తున్నారు. దీంతో.. ప్రభాస్, మహేష్ తర్వాతి బన్నీ ఈ అరుదైన ఘనత దక్కించున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆగష్టు 15న ఈ సీక్వెల్ రిలీజ్ కానుంది.