BDK: అశ్వాపురం మండలం మల్లెల మడుగు సెక్టార్లో నిర్లక్ష్యపు నీడన అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ కొనసాగుతోంది. ఇందుకు ఉదాహరణ ఈ సెక్టార్ పరిధిలోని సత్యనారాయణపురం ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంటకు అంగన్వాడీ కేంద్రానికి తాళాలు ఉండడం గమనార్హం. అంగన్వాడీ కేంద్రాలకు ఎటువంటి సెలవు దినాలు లేకపోయినా టీచర్, ఆయా, తాళం వేయడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.