ADB: విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రజాబాట కార్యక్రమంతో విద్యుత్ సమస్యల దూరమవుతాయని మండల ఏఈ తిరుపతి రెడ్డి అన్నారు. భీంపూర్ మండలంలోని పిప్పల్ కోటి గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కిందికి వేలాడే తీగలు, విరిగిన వంగిన పోల్స్, ట్రాన్స్ఫార్మర్ వంటి సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.