MBNR: బీసీలకు న్యాయమైన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలంటే 42 శాతం రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని బీసీ జేఏసీ కన్వీనర్ బూర్గుపల్లి కృష్ణ యాదవ్ డిమాండ్ చేశారు. జడ్చర్ల మున్సిపల్ పరిధిలోని 12వ వార్డు అంబేద్కర్ కళా భవన్లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లు అమలు చేశాకే ఎన్నికలు నిర్వహించాలన్నారు.